సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అసమర్థత వల్లే సింగరేణిలో వాటాను కోల్పోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సభను ఉద్దేశించి ప్రసంగించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. పలు పార్టీల నుంచి కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రేపు గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.
రాహుల్ కు ఎద్దు ఎవుసం తెలుసో లేదో.. ధరణిని బంగాళఖాతంలో వేస్తామంటున్నారు.. రైతు బంధు ఎలా వస్తది.. భీమా ఎలా రావాలి.. వడ్లు కొంటే బ్యాంకులకే డబ్బులు పంపిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
Revanth Reddy: 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఐటిడీఏలను నిర్వీరియం చేసింది బీఆర్ఎస్ అని మండిపడ్డారు.
Bandi Sanjay: తెలంగాణ ప్రజలను అగ్రవర్ణాల పాలన నుంచి విముక్తి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని... అందుకే బీసీ సీఎం ప్రకటన కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల కోసమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంథనిలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో రాజకీయ పరిణతి పెరగాలి.. ప్రజస్వామ్య పరిణతి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
రైతులు, మహిళలు, నిరుద్యోగులు అన్ని వర్గాల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోందని, బీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలనే కసి ఇక్కడి ప్రజల కళ్లల్లో కనిపిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అలంపూర్‌లో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు.