Revanth Reddy: 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఐటిడీఏలను నిర్వీరియం చేసింది బీఆర్ఎస్ అని మండిపడ్డారు. గిరిజనేతులను నిండా ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలను దత్తత తీసుకుని అన్ని ప్రాంతాలతో ముందుకు తీసుకెల్లుతామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక నిధులతో అభివృద్ది చేస్తామన్నారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం బిచ్చ మెత్తుకునేదన్నారు. సదర్ మాట్, కడెం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కాదా? కరెండ్ ఎక్కడ పోతది. గంటల కరెంట్ ఇస్తున్నావా…సబ్ స్టేషన్ కు పోదాం….24 గంటల కరెంట్ ఇస్తే మేము నామినేషన్ వేయము..సీఎం కేసిఆర్ కు సవాల్ విసిరారు. సవాల్ కు ఒప్పుకుంటావా లేదంటే ఇంద్రవెల్లిలో ముక్కునేలకు రాస్తావా అని సవాల్ విసిరారు.
24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని స్పష్టం చేశారు. రైతు బరోసా పథకం కింది 15 వేల రూపాయలు ప్రతి ఏటా ఇస్తామన్నారు. ధరణిని బంగాళ ఖాతంలో కలుపుతాం.. పట్టాదారులు ఎలా భూములు అమ్ముకుంటున్నారో పోడు భూములకు సైతం పహాణీలు ఇస్తామన్నారు. బ్యాంక్ ల్లో లోన్ ఇచ్చే విధంగా కాపాడుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానమే ఆదివాసీ, లంబాడాలను, గిరిజనేతరులను కాపాడుకునేదన్నారు. ధరణిలో బరాబర్ బంగాళఖాతంలో కలిపేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లంబాడాలు , ఆదివాసీలు రెండు కండ్లు అన్నారు. కేసీఆర్ అబద్దాల కోరన్నారు. సీఎం మతి ఉండే మాట్లాడుతున్నావా? మందేసి మాట్లాడుతున్నావా? అని ప్రశ్నించారు. ధరణి ముసుగులో దందాలు చేస్తున్నారు అందుకే దాన్ని తీసేస్తాయన్నారు. కేటీఆర్, కేసిఆర్ కు చెప్పుతున్న కంప్యూటర్ తెచ్చింది రాజీవ్ గాంధీ అన్నారు. వ్యవసాయ భూముల వివరాలను కంప్యూటరీకరించింది కాంగ్రెస్ పార్టీ.. ధరణి స్థానంలో మంచి పోర్టల్ తీసుకొస్తామన్నారు.
Sajjala Ramakrishna Reddy: సంక్షేమమే అభివృద్ధి అని జగన్ నిరూపించారు
Also Read
తాజావార్తలు
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!