రేపు తెలంగాణ జనసమితి అధ్వర్యంలో చలో ఢిల్లీ నిర్వహించనున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. రేపు మధ్యాహ్నం కల్లా చాలా మంది ఢిల్లీ చేరుకుంటారని వెల్లడించారు. విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్య పై సుమారు 150 మందితో జంతర్ మంతర్ వద్ద ఒక గంటపాటు మౌన దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రేపు జంతర్ మంతర్ వద్ద తెలంగాణలో జరుగుతున్న జలవనరుల దోపిడీ పై దీక్ష చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈనెల 31న కాన్సిట్యూషన్ క్లబ్ లో కేసీఆర్ పాలనపై సెమినార్ నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమానికి యోగేంద్రా యాదవ్, లాంటి చాలా మంది వక్తలు కేసీఆర్ పాలన మిగిల్చిన నష్టంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని ఆయన తెలిపారు. పబ్లిక్ రంగ సంస్థలు, రాష్ట్ర స్థాయి సంస్థల విభజన ఇంకా జరగలేదని, విభజన చట్టంలో 10 వ షెడ్యూల్ లే ఉన్న 93,94,95 ప్రకరనలు చాలా కీలకమైనవి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, పారిశ్రామిక రాయితీలు చాలా కీలకమైనవని, 9 సంవత్సరాల కాలంలో వాటిపై దృష్టి పెట్టలేదన్నారు. రాష్ట్రప్రభుత్వాలు అడగలేదు, కేంద్రం పట్టించుకోక పోవడంతో అవి పరిష్కారం కాలేదని, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ , హార్టికల్చర్ యూనివర్సిటీ లాంటివి రాలేదన్నారు.
Also Read : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ సిద్ధంకండమ్మా.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేస్తున్నాడు
అంతేకాకుండా.. ‘వాటికి సంబంధించిన ఏ చర్యలు తీసుకోవడంలేదు. రైల్వే వసతులు , మౌలిక సదుపాయాలు పెంచాలని, హైదరాబాద్ నుంచి అమరావతి వరకు రైల్ కనెక్టివిటీ పెంచావని , ఖాజీ పేటలో కోచ్ ఫాక్టరీ, ఖమ్మంలో స్టీల్ ఫాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. రెండు రాష్ట్రాల సమాన వికాసం కోసం ఉద్దేశించిన ఏ అంశం అమలు పరచడం లేదు , పరిష్కారం కావడం లేదు. విభజన చట్టంలో ఉన్న అంశాలను సాధించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధంగా లేదు. బీఆర్‌ఎస్ తెలంగాణ సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. తెలంగాణ ప్రజలగా కేంద్రాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉందని దేశరాజధాని ఢిల్లీ లో రెండు రోజులు పాటు ధర్నా , సెమినార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
Also Read : Premi Viswanath: అమ్మ.. వంటలక్క.. బాగా గట్టిగానే ప్లాన్ చేసావ్ గా..?
ఢిల్లీ లో తెలంగాణ , తెలుగు ప్రజలు రేపటి దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. కృష్ణా నదీ జలాల్లో 170 టీఎంసీలు, 22 శాతం నీటి వాటా మాత్రమే తెలంగాణ కు దక్కింది . ప్రస్తుతం ఉన్న నీటివాటాతో పెండింగు ప్రాజెక్ట్ లు పూర్తి చేయడం సాధ్యం కాదు. పెండింగు ప్రాజెక్ట్ లకు నీటి కేటాయింపులు లేకపోవడం వల్ల వాటికి అనుమతులు లభించడం లేదు. అనుమతులు లేని ప్రాజెక్ట్ ల నిర్మాణం చెయ్యవద్దని కేంద్రం గెజిట్ జారీ చేసింది.దీనివల్ల 28 లక్షల ఎకరాలకు రావలసిన నీళ్లు తెలంగాణ కు రావడం లేదు. నీటి వాటాలో రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న అసమానతలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. ఈ దుస్థితిని రూపుమాపడానికి ప్రజలుగా ఐక్యం కావాలసిన అవసరం ఉంది. ఢిల్లీ లో ఆందోళన కార్యక్రమాలు ముగిసిన తర్వాత ప్రజాబాహుళ్యంలోకి వెళ్లి ఆందోళన చేపట్టాలని నిర్ణయించాము.’ అని ఆయన తెలిపారు.