Opposition letter to Modi:కేంద్ర సంస్థల దుర్వినయోగంపై 9 మంది ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. తమ నేతలను ఇరికించేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినయోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు లేఖలో ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇరికించడాన్ని ఆప్ నేతలు ఉదహరించారు. ఇలాగే మరికొన్ని ఉదాహరణలను లేఖలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)లను నేతలను ఇరికించేందుకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణలో అప్పులన్నీ తీరి అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ ఎదిగిందని ఆయన తెలిపారు. శనివారం రాత్రి ఆదిలాబాద్‌లో జరిగిన చేరికల సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 9న జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి శనివారం అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు.
TRS Party: బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి పయనమయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకుని.. కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ పేరుతో రాష్ట్రంలో కొంతమంది కొత్త పార్టీ తీసుకువస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Etela Rajender: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి మరణానికి కారణం వేధింపులేనన్నారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. చైతన్యాన్ని చంపేస్తే ఉన్మాదం వస్తుందన్నారు.
Jagga Reddy : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా విషయమేమీ కాదు ఇది రెండేళ్లుగా రాజకీయవర్గాల్లో నానుతున్న సంగతే.