Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Kcr Visited Ambedkar Secretariat

CM KCR : అంబేద్కర్‌ విగ్రహాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌

Published Date :March 10, 2023 , 4:24 pm
By Gogikar Sai Krishna
CM KCR : అంబేద్కర్‌ విగ్రహాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధమౌతున్నతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయం, డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్యోతి పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు పరిశీలించారు. తొలుత సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ చివరి దశకు చేరుకున్న ఎలివేషన్ పనులను, ఫౌంటేన్, గ్రీన్ లాన్, టూంబ్ నిర్మాణం దానికి తుది దశలో అమరుస్తున్న స్టోన్ డిజైన్ వర్కు తదితర పనుల పురోగతిని పరిశీలించారు. సెక్రటేరియట్ ప్రధాన ద్వారం అత్యంత విశాలంగా నిర్మించిన తీరును, భోపాల్ నుంచి ప్రత్యేకంగా వుడ్ కార్వింగ్ చేసి తెప్పించి అమర్చిన ద్వారాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్‌ సంతృప్తిని వ్యక్తం చేశారు.

Also Read : PM Narendra Modi: ఆస్ట్రేలియా ప్రధానితో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన మోదీ..

Also Read

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..
  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
  • IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..

అనంతరం సీఎం చాంబర్ వుండే ఆరవ అంతస్తుకు చేరుకున్నారు. సీఎం చాబంర్ లో ఏర్పాటు చేసిన టేబుల్లు, కుర్చీలు తదితర ఫర్నీచర్ ను సీఎం పరిశీలించారు. గత పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన సూచనల మేరకు వాల్ క్లాడింగ్, డెకరేషన్ తదితర తుదిమెరుగులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తెల్లని రంగు తో కూడిన గోల్డ్ కలర్ పట్టీలతో తీర్చిదిద్దిన గోడలు, గోడల రంగుతో సరిపోయే విధంగా వేసిన మార్బుల్ ఫ్లోరింగ్, విశాలమైన కారిడార్లు, అంతే అందంగా తీర్చిదిద్దిన చాంబర్ల ద్వారాల పనితీరును పరిశీలించి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను, వర్క్ ఏజెన్సీ అధికారులను సీఎం అభినందించారు. నిర్మాణం పూర్తయిన తరువాత అక్కడ చోటు చేసుకున్న గాలి వెలుతురు తో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గమనించి సీఎం కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చాంబర్ లోని సమావేశ మందిరాన్ని పరిశీలించారు.

Also Read : Dangerous Virus: భారత్‌లో ఇన్‌ఫ్లూయెంజా పంజా.. H3N2 వైరస్‌తో ఇద్దరు మృతి

సీఎంవో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన చాంబర్లను, అందులో అమరుస్తున్న ఫర్నీచర్ ను తిలకించారు. ఏర్పాట్లన్నీ సిబ్బంది పనికి అనుకూలంగా వుండే విధంగా వున్నాయా లేవా అని ఆరా తీసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చాంబర్ ను, వారి సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాలను, కాన్ఫరెన్స్ హాల్ ను, సందర్శకుల కోసం వేచివుండే గదులను అందులోని సౌకర్యాలను సీఎం పరిశీలించారు. సమావేశాలు సహా, డైనింగ్ తదితర అవసరాలకోసం మల్టిపుల్ గా ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేసిన విశాలవంతమైన హాల్ ను సీఎం పరిశీలించారు. నలుమూలలా కలియతిరిగిన సీఎం కేసీఆర్.. కార్యదర్శులు, ఇతర సిబ్బంది కార్యాలయాలను పరిశీలించారు. జీఏడి ప్రోటోకాల్ సిబ్బందికోసం ఏర్పాటు చేసిన చాంబర్లను సీఎం పరిశీలించారు. కలెక్టర్ల కాన్పరెన్స్ హాల్., ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ లాంజ్, విఐపీల వెయిటింగ్ లాంజ్ లను పరిశీలించారు. మంత్రిలకు కేటాయించిన శాఖలు అన్నీ వొక దగ్గర వుండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు, ఆ మంత్రికి చెందిన అన్ని శాఖల సిబ్బంది వొకే చోట వుంటే బాగుంటదని సీఎం అన్నారు. ఆయా శాఖలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుకూలంగా కార్యాలయాలుండాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

అనంతరం గ్రౌండు ఫ్లోర్ కు చేరుకున్న సీఎం, దక్షిణ భాగం గుండా నడుచుకుంటూ అక్కడ నిర్మాణంలో వున్న పార్కింగ్ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, వర్క్ ఏజెన్సీలకు, ఇంజనీర్లకు సీఎం కొన్ని సూచనలు చేశారు. అనంతరం సచివాలయం ప్రహారి కి అంతర్గతంగా వున్న, బయట చుట్టూ నిర్మాణం చేస్తున్న రోడ్లు పరిసరాలను పరిశీలించారు. సచివాలయం ముందునుంచి, దక్షిణం నుంచి ఉత్తరం వైపు ట్యాంకుబండు మీదుగా వెళ్ళే మార్గాన్ని పరిశీలించారు. ఫ్లై ఓవర్ నుంచి, సచివాలయం ముందునుంచి నెక్లెస్ రోడ్డు దిశగా సాధారణ ప్రజలు ప్రయాణించేందుకు విశాలంగా నిర్మితమౌతున్న రోడ్లను సీఎం పరిశీలించారు. సెక్రటేరియట్ లోపలకు వెళ్ళే ప్రధానమార్గాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం సెక్రటేరియట్ చుట్టూ తిరిగి పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. తాను అనుకున్నట్టుగానే సచివాలయ నిర్మాణం పనులు పూర్తికావచ్చినందుకు సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయం నుంచి నిర్మాణంలో వున్న డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు.

అక్కడ మొదటి అంతస్తుకు చేరుకున్న సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం బేస్ లో నిర్మిస్తున్న విశాలమైన హాళ్ళను ఆడియో విజువల్ ప్రదర్శనకోసం నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు, బయట ఫౌంటేన్, లాండ్ స్కేపింగ్ తదితర పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతి గురించి మంత్రి కొప్పుల ఈశ్వర్ ను, వర్క్ ఏజెన్సీలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతలో ఏమాత్రం లోటు రావద్దని స్పష్టం చేశారు. చారిత్రకంగా నిర్మితమౌతున్న డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

అక్కడినుంచి తెలంగాణ అమర వీరుల స్మారకార్థం నిర్మిస్తున్న అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. మొదటి అంతస్తులో ఆడియో, వీడియో ప్రదర్శనల కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం; లేజర్ షో, ర్యాంప్, సెల్లార్ పార్కింగ్ పనులను పరిశీలించారు. నిర్మాణ పురోగతిని ఇంజనీర్లు మ్యాపుల ద్వారా సీఎంకి ఇంజనీర్లు వివరించారు. పనుల గురించి సంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కొన్నిసూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్; ఎమ్మెల్యేలు విప్ బాల్క సుమన్, ఎ. జీవన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రోడ్లు భవనాలు శాఖ అధికారులు శ్రీనివాస్ రాజు, గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తదితరులున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ambedkar secreateriat
  • breaking news
  • cm kcr
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions