Bandisanjay satire on KTR: కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు నన్ను కెలకాలనుకుంటున్నాడు నేను ఊరుకుంటనా అంతకంటే ఎక్కువ కెలుకుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వాఖ్యలు చేశారు. నామీద 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందిని పెట్టారని అన్నారు. మేడ్చల్ జిల్లా, దుండిగల్ గండిమైసమ్మ మండలంలోని గ్రామం కొంపల్లిలో జరుగిన ‘ఉపాధ్యాయ – అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం’లో బండి సంజయ్ మాట్లాడుతూ.. కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్ లో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంట్ లో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ బిడ్డ మీద ఈడీ, సీబీఐ విచారణలు చేస్తుంటే మాత్రం స్పందిస్తారు…. మరి ఇతరుల మీద ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. కవిత మహిళా బిల్లుపై చేస్తున్న దీక్షను చూసి జనం నవ్వుకుంటున్నారు. కేసీఆర్ బిడ్డ చేసిన దొంగ సారా దందావల్ల తెలంగాణ ప్రజలు తలదించుకునే దుస్థితి ఏర్పడింది అన్నారు. తెలంగాణ వచ్చినాక ఏం ఒరిగింది? 2014కు ముందు మద్యం ద్వారా రూ.10 వేల కోట్లు మాత్రమే వస్తే… కేసీఆర్ పాలనలో మద్యాన్ని ఏరులై పారించి రూ.40 వేల కోట్లు ఆదాయం సంపాదిస్తున్నరు. అయినా తెలంగాణ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందన్నారు.
కోవిడ్ తో ప్రపంచమంతా అల్లకల్లోలమైన సమయంలో భారత్ మాత్రం స్థిరంగా ఉంటూ ఆర్దికంగా 5వ స్థానంలో నిలిచిందన్నారు. 2047 నాటికి నెంబర్ వన్ స్థానానికి చేరుకోబోతోందని అన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించి ప్రాణాలు నిలిపిన ఘనత మోదీదే తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వం గత మూడు నెలల్లో 2.16 లక్షల ఉద్యోగాలిస్తే… కేసీఆర్ మాత్రం ఇంటికో ఉద్యోగమని ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేన్నారు. దళిత బంధు, రుణమాఫీ, ఫ్రీ యూరియా, నిరుద్యోగ భ్రుతి హామీలు అమలు చేయలేదన్నారు. చివరకు ఫస్ట్ నాడు కూడా జీతాలు ఇయ్యలేని దుస్థితి ఏర్పడిందన్నారు. జీతాలియ్యకపోయినా టీచర్లు ఏం చేయలేరనే భావనతో కేసీఆర్ ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల సత్తా ఏమిటో కేసీఆర్ కు రుచి చూపించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ నాడు జీతాలిచ్చే బాధ్యత మాది. పెండింగ్ డీఏలన్నీ నెలలోనే ఇస్తాం. వెంటనే పీఆర్సీ వేస్తాం… 317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను బదిలీ చేస్తామన్నారు. 317 జీవోను సవరించాలని నేను దీక్ష చేస్తే నా ఆఫీస్ ను గ్యాస్ కట్టర్లు పెట్టి ధ్వంసం చేశారు.
మాపై దాడులు చేశారు. లాఠీఛార్జ్ చేశారు. జైల్లో వేశారు. అయినా ఏ ఉపాధ్యాయ సంఘం కూడా కేసీఆర్ కు భయపడి కనీసం మద్దతివ్వలేదని. అయినా మేం భయపడలేదు. మేం టీచర్ల పక్షాన కొట్లాడిన్నామన్నారు బండి సంజయ్. ఈరోజు 317 జీవో వల్ల టీచర్లు, ఉద్యోగులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిందంటే… అది బీజేపీ చేసిన పోరాటాలవల్లనే. రైతులు, నిరుద్యోగులు, దళిత, గిరిజనుల పక్షాన నిరంతరం ఉద్యమిస్తూ జైలుకు పోతున్న పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన రూ.5 లక్షల కోట్ల అప్పులన్నీ తీరాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీయే రాష్ట్రంలోనే అధికారంలోకి వస్తేనే సాధ్యం. పొరపాటున మళ్లీ కేసీఆర్ గెలిస్తే మరో రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అడుక్కునే తినే దుస్థితికి తీసుకొస్తాడన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పీఆర్సీ గురించి ఎందుకు మాట్లాడలేదు? కేబినెట్ లో ఎందుకు చర్చ జరగలేదని ఎందుకు నిలదీయడం లేదు? అని ప్రశ్నించారు. డీఏలు ఎందుకు ఇవ్వడం లేదు? ఫస్ట్ తారీఖున జీతాలెందుకు ఇవ్వడం లేదని ఎన్జీవో నాయకులు ఎందుకు అడగడం లేదు? కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ… కేసీఆర్ పెట్టే విందు భోజనాలకు తలొగ్గి ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి కేసీఆర్ చెంప చెళ్లుమన్పించేలా తీర్పు ఇవ్వండి. బీజేపీకి ఒక్క అవకాశమివ్వండని బండి సంజయ్ కోరారు.
Bandi sanjay: ఒక్క ఛాన్స్.. బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ నాడు జీతాలిచ్చే బాధ్యత మాది