Revanth Reddy: అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు.. అక్కడ కేసీఆర్.. ఇక్కడ కేటీఆర్ పాత్రదారులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద సమస్యగా మారిందని మండిపడ్డారు. పేపర్ లీకేజీలతో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ తప్పిదాలకు ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు.కేటీఆర్ తనకేం సంబంధం అని అతి తెలివిగా ప్రశ్నిస్తున్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని వివరాలు ఎందుకు సేకరించలేదు? చంచల్ గూడ జైలుకు వెళ్లి కొందరు.. వారిని ఎం కౌంటర్ చేస్తామని బెదిరించి లొంగదీసుకున్నారు? అందుకే కేటీఆర్ ప్రెస్ మీట్ అయ్యాకనే వారిని కస్టడీలోకి తీసుకున్నారని ఆరోపించారు. ఈ నెల 13 నుంచి 18 వరకు చంచల్ గూడ జైలు సందర్శకుల వివరాలు, సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని, కేటీఆర్ ఏమైనా విచారణ అధికారా? టీఎస్ పీఎస్సీ లో పనిచేసే వారు పోటీ పరీక్షలు రాయడానికి అర్హత లేదు. కానీ ప్రభుత్వం పరీక్షలు రాసుకోవడానికి ఎన్ఓసీ ఇచ్చింది..నిబంధనలకు విరుద్ధంగా 20 మందికి పైగా పోటీ పరీక్షలు రాశారన్నారు. మాధురి అమెరికా నుంచి వచ్చి గ్రూప్1 రాస్తే మొదటి ర్యాంక్ వచ్చింది.
Read also: Revanth Reddy: విచారణ చేయకముందే ఇద్దరు మాత్రమే బాద్యులని కేటీఆర్ ఎలా చెపుతారు?
Also Read
జూనియర్ అసిస్టెంట్ రజినీకాంత్ రెడ్డికి 4వ ర్యాంక్ వచ్చింది. Tspsc ద్వారా రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం,ప్రమోషన్ వివరాలు ప్రభుత్వం బయటపెట్టాలి. లీకేజీ వ్యవహారంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మీ పాత్ర ఉందొ లేదో విచారణ చేపట్టాలి. ఈ విషయం కేటీఆర్ కు తెలుసా లేదా?అని ప్రశ్నించారు. ఒక మంత్రి పేషీలో మంత్రికి తెలియకుండా ఇదంతా జరగదని, కేటీఆర్ మంత్రి కార్యాలయమే అన్ని వ్యవహారాలను చక్కదిద్దిందని.. ఈ ఆరోపణల నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోలేరని రేవంత్ మండిపడ్డారు. 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇంత తీవ్రమైన సమస్యపై సీఎం స్పందించి నిరుద్యోగులకు భరోసా ఎందుకు ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులపట్ల సీఎంకు ఇంత బాధ్యతారాహిత్యమా? కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల, ఏఆర్ శ్రీనివాస్ కు ఉన్న బంధమేంటి? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ కు అప్పగించిన ఏ కేసు ముందుకు సాగలేదు? పేపర్ లీకేజీ కేసును సీబీఐకి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు.. అక్కడ కేసీఆర్.. ఇక్కడ కేటీఆర్ పాత్రదారులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో రేపు వాదనలు వినిపిస్తామన్నారు. 21న గవర్నర్ ను కలిసి పిర్యాదు చేసి.. తక్షణమే వారిని ప్రాసిక్యూట్ చేయాలని కోరతామన్నారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు పిలుపునిస్తున్నా..కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం.. తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దామని రేవంత్ సంచలన వ్యాఖ్యాలు చేశారు.
Vemula Prashanth Reddy: రేవంత్ రెడ్డివి దొంగ మాటలు.. తనతో ఉన్నవాళ్లు కూడా దొంగలు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!