BRS central office: ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్గు ఇవాళ మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు. అంతకుముందు మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహించే యాగశాల, సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో పాల్గొంటారు.
Bandi sanjay: అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రోడ్లపై తడిసిన ధాన్యం ఆరబోస్తున్న రైతుల వద్దకు బండి సంజయ్ వెళ్లి వారి బాధలు తెలుసుకున్నారు.
Neera cafe: ట్యాంక్ తీరంపై ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయగా.. పక్కనే కొత్త సచివాలయం ఏర్పాటైంది. కాగా.. ఇప్పుడు నీరా కేఫ్ కూడా సిద్ధమైంది. నగరవాసులకు నోరూరించే తీపి నీరాను అందించి పరిశ్రమ స్థాయికి నీరాను తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం 'నీరా కేఫ్'ను ఏర్పాటు చేసింది.
Indrakaran reddy: రాష్ట్రంలోని ప్రముఖ శైవాలయ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. వెంటనే ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తెలంగాణ రైతులకు తీరని నష్టం వాటిల్లింది. కుండపోత వానల వల్ల వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది...