Hare Krishna Heritage: హైదరాబాద్‌లోని నార్సింగిలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్‌కు భూమిపూజ కార్యక్రమాన్ని మే 8వ తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు హెచ్‌కెఎం ప్రకటించింది. 6 ఎకరాల సువిశాల గోష్పాద క్షేత్రంలో 400 అడుగుల (120 మీటర్లు) ఎత్తుతో హైదరాబాద్‌లో మరో ఐకానిక్ సాంస్కృతిక మైలురాయిగా మారనున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ వేడుక సీఎం కేసీఆర్, మధు పండిట్ దాస్ సమక్షంలో జరగనుంది.