పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 350 కి పైగా కోట్ల రూపాయలు దోచేశారు అని ఆయన ఆరోపించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి భయం పరిచయం చేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. నాకు రోగాలు ఉన్నాయి బెయిల్ ఇవ్వండి అని వేడుకుని చంద్రబాబు బయటకు వచ్చాడు.
సామాజిక సాధికార బస్సు యాత్ర ఒక విప్లవం అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. అణగారిన కుటుంబాలకు, కులాలకు అండగా నిలబడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు అయిన సామాజిక సాధికారత ఒక మాట గా మాత్రమే ఉంది.
చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగనుకు లేదు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.. సీబీఐ, ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర పన్నారు.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. పార్టీ మారే ఉద్దేశ్యం ఉంటే ఇక్కడికి రాను అని తెలిపారు. నాలుగేళ్ల మంత్రి పదవి వదులుకుని జగన్ కోసం వచ్చిన వాడిని.. ముఖ్యమంత్రి దగ్గరకు రావటానికి నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల కోసమే కేసీఆర్ వ్యాఖ్యలు.. ఏడు విలీన మండలాల ప్రజలు మళ్ళీ తెలంగాణకు వెళతారా అని ఎవరో అడిగితే మేం వెళ్ళమని స్పష్టం చేశారు అని ఆయన తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు-2023ని అందజేయనుంది. ఏపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు (బుధవారం) విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే అవార్డుల ప్రదానోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు.
విజయనగరం రైలు ప్రమాద ఘటన గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఇవాళ ఘటనా స్థలానికి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకుని.. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన ప్రాంతానికి హెలికాఫ్టర్‌లో చేరుకుంటారు. అటు నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరామర్శకు సీఎం వైయస్ జగన్ వెళ్తారు. విజయనగరం జిల్లాలో కంటాకపల్లి వద్ద ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. breaking news, latest news, telugu…