శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జగనన్న అమ్మ ఒడి నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. 43 లక్షల 96 వేలమంది తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.6,595 కోట్లను జమ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అమ్మ ఒడి స్కీం ద్వారా గత మూడేళ్లలో అక్క చెల్లెమ్మల ఖాతాలలో మొత్తం రూ.19,618 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రతి తల్లి తమ బిడ్డలను మంచిగా చదివించాలని తాపత్రయపడుతుందని.. అలాంటి వాళ్లకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని…
మొక్కై వంగనిది మానై వంగుతుందా..? ప్రస్తుతం హిందూపురం వైసీపీలో పరిస్థితి అలాగే ఉంది. మూడేళ్ల క్రితం మొదలైన వర్గపోరు చినికి చినికి గాలి వాన కాదు.. పెద్ద తుఫానుగా మారిపోయింది. ఛాన్స్ దొరికితే చాలు కొట్టేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మహ్మద్ ఇక్బాల్.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనంటే నియోజకవర్గంలోని మరో వర్గానికి అస్సలు పడటం లేదు. ఇన్నాళ్లూ ఏదో ఒక రూపంలో అసమ్మతి తెలియజేసినా.. ప్రస్తుతం మాత్రం ఆ సెగలు రోడ్డెక్కడంతో…
ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. జగనన్న అమ్మ ఒడి నిధులను విడుదల చేసేందుకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన శ్రీకాకుళం చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికారు. పలువురు మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు హెలిప్యాడ్ వద్ద జగన్‌కు స్వాగతం పలికారు. అయితే సీఎం హెలిప్యాడ్ వద్దకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆమె అధికారుల ఆగ్రహం…
సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న అమ్మ ఒడి పథకం మూడో ఏడాది నిధులను సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో వర్చువల్‌గా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అమ్మ ఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రతి ఏడాది రూ.15వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ సాయాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నగదును జమచేస్తోంది. ఒకటి నుంచి…
మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి భరత్‌పై వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 83వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు విజయంపై సీఎం జగన్ స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా ఆత్మకూరులో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని సోషల్ మీడియాలో జగన్ ట్వీట్ చేశారు. విక్రమ్‌ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి…