YSRCP: 2024 ఎన్నికల్లోనూ గెలవాలని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో పార్టీ పటిష్టతపై హైకమాండ్ దృష్టి సారించింది. ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. పరిశీలకుల జాబితాపై పార్టీ కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఈ జాబితా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌కు అదనంగా పరిశీలకుడు ఉంటాడని తెలుస్తోంది. నియోజకవర్గ నేతలకు, పార్టీకి అనుసంధాన కర్తగా…
CM Jagan: అమరావతి సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో జగనన్న విద్యా కానుకపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక కింద అన్నిరకాల వస్తువులు అందించేలా కార్యాచరణ సిద్ధం చేశామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యా కానుక కచ్చితంగా అందాలని సీఎం జగన్ సూచించారు. యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో వేయాలన్నారు.…