ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆహ్వానం మేరకు అమరావతి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ భేటీ ముగిసింది. సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై గంటన్నర పాటు మెగాస్టార్ చిరంజీవి కి, సీఎం జగన్ కు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినాట్లు తెలుస్తోంది. ఇక భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ” జగన్ గారితో తో సమావేశం చాలా సంతృప్తిగా జరిగింది. సంక్రాంతి పండగ పూట ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం…
ఏపీలో బీజేపీ స్ట్రాటజీ మారిపోతోంది. ఎప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఈసారి కొత్త తరహా రాజకీయానికి తెర లేపింది. వివిధ ప్రధాన నగరాల్లో ముఖ్యమైన ప్రాంతాలకు ఉన్న పేర్లను మార్చాలనే డిమాండ్లను తెరపైకి తెస్తోంది. ప్రత్యేకంగా ప్రజాగ్రహ సభ తర్వాత బీజేపీ పంథాలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. అయితే బీజేపీ ఇదే దూకుడును ప్రదర్శిస్తే.. ముందు ముందు మరిన్ని సెన్సిటీవ్ అంశాలను టచ్ చేయడం ఖాయమనే భావన వ్యక్తమవుతోంది. ఏపీలోని ప్రధానమైన ప్రాంతాలకు ఉన్న పేర్లల్లో కొన్నింటికి…
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ వేడకలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు హజరయ్యారు. జగన్ జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను సజ్జల ప్రారంభించారు. రక్తదానం, వస్త్రాల పంపిణీ వంటి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేపట్టారు. అన్ని మతాల మత పెద్దలు ప్రార్ధనలు చేశారు.అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్ కు…
అధికారం మనదే.. అడిగేవారే లేరు.. అంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్న ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా? నిఘావర్గాల నివేదికలతో ఆ ఎమ్మెల్యేల జాతకాలు మారబోతున్నాయా? అన్నీ చూస్తున్న హైకమాండ్… వారిని వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చిందా? జగన్ గాలిలో అనామకులు సైతం ఎమ్మెల్యేలుగా గెలుపు..! 2014లో ఓడిన వైసీపీ 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీకి కంచుకోటలు వంటి నియోజకవర్గాల్లో సైతం వైసీపీ విజయబావుటా ఎగుర వేసింది. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండా ఇతర…
ఎమ్మెల్సీలుగా 11మంది వైసీపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 11మంది సభ్యులు… ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు… విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి, చెన్నూబోయిన శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే… తూర్పుగోదావరి నుండి అనంత సత్య ఉదయ భాస్కర్( బాబు)…. కృష్ణా జిల్లా నుండి మొండితోక అరుణ్ కుమార్, తలశిల రఘురామ్ ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు…
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పా రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను కలిశారు. శిల్పా రెడ్డి నటుడు సమీర్ రెడ్డికి సోదరి, అలాగే సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు. ఇటీవలే వారిద్దరూ కలిసి ఆధ్యాత్మిక ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శిల్పా సీఎం జగన్ ను విజయవాడలో కలిసినట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. Read…
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. నిర్ణీత గడువులోగా పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించారు. కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యంతో పాటు…
అనంతపురం జిల్లాలో రికార్డులు బద్ధలయ్యాయి. కరువుసీమలో వందేళ్లలో లేనంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఏడాదంతా కురిసే వర్షం నెలరోజుల్లోనే 40 శాతం కురిసింది. భారీ స్థాయిలో వానలు కురవడంతో నష్టం కూడా బాగా పెరిగింది. నిత్యం కరువుతో వుండే ప్రాంతంలో వానలే వానలు. మంచి నీటి కోసం ఇబ్బందులు పడ్డవారు ఇప్పుడు వాటర్ పైప్ లైన్లు పాడయిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో కనీవీనీ ఎరుగని రీతిలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాణాలు కూడా పోయాయి. 150…
భారీ వర్షాలతో మునుపెన్నడూ చూడనివిధంగా ఏపీలో వరదలు పోటేత్తాయి. భారీ వరదలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. దీంతో విపక్షాలతో పాటు కేంద మంత్రులు సైతం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును ఉద్దేశించి మంత్రి అనిల్ మాట్లాడుతూ.. నీ ప్రచారం పిచ్చి వల్ల పుష్కరాల్లో చనిపోయిన కుటుంబాలకు ఎంత నష్టపరిహారం ఇచ్చావ్? అని ప్రశ్నించారు. రాయల్ చెరువు తెగి…
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలో వరదలు సంభవించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో తీవ్ర పంట, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వర్షాలతో అన్నమయ్య ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరడంతో అన్నమయ్య జలాశయం కొట్టుకుపోయింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోవడం మానవ తప్పిదం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు చేశారు. చంద్రబాబు మాటలకు కౌంటర్‌గా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. అన్నమయ్య ప్రాజెక్ట్ కెపాసిటీ 2లక్షల 17…