నంద్యాల జనసంద్రాన్ని తలపిస్తోందని సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' సభలో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాల పాలన చూశారని.. నారా వారి పాలన మళ్లీ ఒప్పుకోమని ఏపీ ప్రజలు చెబుతున్నారని సీఎం అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. గతంలో చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చూశాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రను మొదలుపెట్టారు. ఇప్పటివరకు మూడు నియోజకవర్గాలలో బస్సు యాత్ర ముగిసింది. తొలిరోజు వైఎస్సార్ జిల్లా కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగించింది.
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్... తన తండ్రి సమాధి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు.