ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆయన చేపట్టిన ఈ యాత్ర గురువారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా చిన్నసింగమలకు చేరుకుంది. చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రను మొదలుపెట్టారు. ఇప్పటివరకు మూడు నియోజకవర్గాలలో బస్సు యాత్ర ముగిసింది. తొలిరోజు వైఎస్సార్ జిల్లా కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర కొనసాగించింది.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర నేపథ్యంలో జిల్లా నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జీలు హాజరైయ్యారు.