2047 విజన్ అనేది వ్యక్తి కోసం, కులం కోసం కాదని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తెచ్చేందుకు ఇచ్చే హామీ అని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ఇంత స్వేచ్చగా రాష్ట్రంలో మాట్లాడుకున్నామా? అని సీఎం ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశాలు ఇస్తే.. వాటిని వైసీపీ రద్దు చేసిందని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో అమరావతిపై కక్షతో వ్యవహరించారని, పోలవరంను నాశనం చేసి పక్కన పెట్టారని ధ్వజమెత్తారు.…
సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆడ పిల్లలను ఎంత బాధ్యతగా పెంచుతామో.. మగ పిల్లలను కూడా అలాగే పెంచాలన్నారు. కావాలని ఎవ్వరూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడరని, పిల్లలపై తల్లిదండ్రుల నిఘా ఎప్పుడు ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మత్తు పదార్ధాలు లేకుండా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని హోంమంత్రి తెలిపారు. ‘ఆడ బిడ్దలను రక్షిద్దాం.. సమాజాన్ని కాపాడుకుందాం’ అని పిలుపునిచ్చారు. ఆడ పిల్లలను కాపాడాలనే నినాదంతో ‘సేవ్ ది గర్ల్…
సోమవారం రేపు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనులు పరిశీలన అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్ను కూడా సీఎం విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. సీఎం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. 2024 ఏపీ అసెంబ్లీ…
జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జమిలీ అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అంటున్నారు.. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం అని గుర్తుచేశారు.. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని దుయ్యబట్టారు.. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయి.. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని సెటైర్లు చేశారు.
త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం.. అతి త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఆనందంగా ఉందని, దేశ చరిత్రలోనే 100 ఏళ్ల చరిత్ర గల ప్రాజెక్ట్ నిజాంసాగర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో 1.81 లక్షల…
వికసిత భారత్లో భాగమే స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విజయవాలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.. సైబరాబాద్ ఛీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.. సీఎం చంద్రబాబు ఓపికని చాలా మెచ్చుకోవాలి.. సీఎం చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలోని 26 జిల్లాలు, 40 డిపార్ట్మెంట్ లు పనితీరు, చేయాల్సిన పనులపై సమీక్షించారు.. అన్ని జిల్లాల కలెక్టర్లు ఎలాంటి ప్రణాళికలతో పని చేస్తున్నారు అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది.. ప్రభుత్వం చేసినపాలసీలు, డిపార్ట్మెంట్ ల వారీగా తీసుకున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చ జరిగింది.. సమస్యలపై స్పందిస్తూ సీఎం చంద్రబాబు కొన్ని విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు.. కొన్నింటికి పరిష్కారా దిశగా సూచనలు చేశారు. కొందరు అధికారుల, కొన్ని డిపార్ట్మెంట్…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బెజవాడలో పర్యటించనున్నారు.. విజన్ 2047 రిలీజ్ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. ఇక, సీఎం సభ సందర్భంగా బెజవాడలో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు.. బందరు రోడ్డులో పూర్తిగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
రేపు బెజవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. విజన్ 2047 రిలీజ్ సందర్భంగా చంద్రబాబు సభలో ప్రసంగించనున్నారు. సీఎం సభ సందర్భంగా బెజవాడలో రేపు ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి.