ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన ముగిసింది. సీఎం చంద్రబాబు గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు జ్యూరిచ్ నుంచి బయల్దేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీలోని అధికారిక నివాసానికి సీఎం చేరుకున్నారు. ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్‌తో సమావేశం అవుతారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను చంద్రబాబు కలనునారు. అలానే శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిలతో భేటీ కాకానున్నారు.…
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం.. లబ్దిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామ సభల్లో లీడర్ల చెంపలు పగులుతున్నాయి. గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక సందర్బంగా నాయకుల మధ్య విద్వేశాలు రగులుతున్నాయి. అయితే, తాజా ఘర్షణలకు ఎక్కువ భాగం నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి మధ్యనే వివాదాలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఈ సభల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పట్టణాల్లో సాఫీగా జరుగుతున్నప్పటికీ గ్రామాల్లోమాత్రం నేతల మధ్య వాగ్వావాదాలు,…
ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. వచ్చే నెల (ఫిబ్రవరి 6) న ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో వచ్చే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. త్వరలో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి దావోస్ వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సీఎం చంద్రబాబుతో కలిసి వివిధ సంస్థల భేటీల్లో పాల్గొంటున్న ఆయన.. మరోవైపు.. అవకాశం దొరికొనప్పుడు ఇతర సంస్థలతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు..
దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం పర్యటన కొనసాగుతోంది.. ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్‌ను కోరారు సీఎం చంద్రబాబు.
దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముగ్గురు సీఎంలు పాల్గొన్నారు.. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.
భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచడంపై కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం.. వచ్చే నెల (ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందట.. అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలతో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందట.. అయితే, అమరావతి ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే విషయంలో మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందట..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లో మూడో రోజు పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మూడవ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తారు. యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధినేతలతో సీఎం సమావేశం కానున్నారు. బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ ఇవాళ సీఎం చర్చలు జరపనున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో రాష్ట్ర ప్రభుత్వం…
తొలిసారి డిప్యూటీ సీఎం ప్రచారంపై స్పందించిన నారా లోకేష్.. తాను రాజకీయంగా సెటిల్‌గా ఉన్నాను.. ఎన్నికల్లో ప్రజలు మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించారు.. 94 శాతం సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించారని తెలిపారు.. ఇక, నాకు ప్రస్తుతం చేతి నిండా పని ఉంది.. నాపై బాధ్యత కూడా ఉంది అన్నారు.. తనకు అప్పగించిన శాఖలపై పనిచేస్తున్నాను అన్నారు