CM Chandrababu Davos Visit: స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా మూడో రోజూ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో పారిశ్రామిక పురోగతిపై నిర్వహించే ప్రత్యేక సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, అభివృద్ధి ప్రణాళికలను అంతర్జాతీయ…