విద్యార్థులకు ఇచ్చిన హామీని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నిలబెట్టుకున్నారు. 10, 12వ తరగతుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఉచిత హెలికాప్టర్ రైడ్ అవకాశాన్ని కల్పించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.
Chhattisgarh police induct 9 transgender people in ‘Bastar Fighters’ special unit: సమాజంలో ఓ రకంగా చిన్నచూసే ట్రాన్స్‌జెండర్లు తాము కూడా ఎందులో తీసిపోమనే విషయాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తమ పోలీస్ శాఖలోకి తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లను రిక్రూట్ చేసుకుంది. పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ పోలీసులు లింగవివక్షతను రూపుమాపేందుకు దీన్ని ఓ ఉదాహరణగా చెబుతున్నారు. మొత్తం 608 మంది ఎంపికైన అభ్యర్థుల్లో…
చత్తీస్ గఢ్ లోని జాంజ్ గిర్ -చంపా జిల్లాలో 10 ఏళ్ల బాలుడు బోర్ బావిలో పడిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పిహ్రిద్ గ్రామంలో ఇంటి వెనకాలు ఉన్న పెరట్లో ఆడుకుంటున్నరాహుల్ సాహు అనే బాలుడు నిరుపయోగంగా ఉన్న బావిలో జూన్ 10న పడిపోయాడు. అప్పటి నుంచి బాలుడిని బయటకు తీసుకువచ్చేందుకు రక్షణ చర్యలు సాగుతున్నాయి. దాదాపుగా 62 అడుగుల లోతులో ఇరుక్కున్నాడని రెస్య్కూ సిబ్బంది చెబుతోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ( ఎన్డీఆర్ఎఫ్),…
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కొరడా దెబ్బలు తిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అదేంటి సీఎంకు కొరడా దెబ్బలు ఏంటి? అనే అనుమానం వెంటనే కలుగొచ్చు.. ఏ ఆలయానికైనా వెళ్లినప్పుడు.. అక్కడ నమ్మకాలు, భక్తుల విశ్వాసం మేరకు కొన్ని చేస్తుంటారు.. అలాంటే నమ్మకాన్నే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఫాలో అయ్యారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also: కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కలుపుకుపోవాలి.. నేను మాట్లాడుతా.. ఛత్తీస్‌గఢ్ లోని…
ఓ సీఎం తండ్రిపై కేసు నమోదు కావడమే సంచలనంగా మారగా.. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం చర్చగా మారింది.. ఇక, ఆ అరెస్ట్‌ను సీఎం సమర్థించారు.. చట్టం ముందు సమానులేనని స్పష్టం చేశారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్ తండ్రి నంద్‌కుమార్ బఘెల్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. బ్రహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. చత్తీస్‌గఢ్ పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేశారు. బ్రహ్మణ సంఘం నేతల ఫిర్యాదుతో నంద్‌కుమార్ ను…
ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు… బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.. కాగా, బ్రాహ్మణులను విదేశీయులుగా పేర్కొన్న నంద్‌కుమార్ బాఘేల్.. వారిని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు.. అయితే, ఈ ఘటనపై మండిపడ్డ బ్రాహ్మణ సంఘాలు.. నంద్ కుమార్ బాఘేల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ.. రాయ్‌పూర్‌లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. దాంతో ఆయనపై ఐపీసీ 153-ఏ, 505(1)(బీ) కింద…
ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో… కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. ఒక రాష్ట్రం వివాదం ముగిసిందనుకుంటే… మరో రాష్ట్రంలోని నేతల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా… నాయకులు గళమెత్తుతున్నారు. మొన్న రాజస్థాన్, నిన్న పంజాబ్, తాజాగా చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పంజాబ్ వ్యవహారం క్లోజ్ అయిందనుకుని… ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో.. ఛత్తీస్‌గఢ్‌లో కొత్త లొల్లి షురూ అయింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా……