సీఎంకు కొరడా దెబ్బలు..! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కొరడా దెబ్బలు తిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అదేంటి సీఎంకు కొరడా దెబ్బలు ఏంటి? అనే అనుమానం వెంటనే కలుగొచ్చు.. ఏ ఆలయానికైనా వెళ్లినప్పుడు.. అక్కడ నమ్మకాలు, భక్తుల విశ్వాసం మేరకు కొన్ని చేస్తుంటారు.. అలాంటే నమ్మకాన్నే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఫాలో అయ్యారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: కోమటిరెడ్డి బ్రదర్స్‌ను కలుపుకుపోవాలి.. నేను మాట్లాడుతా..
Also Read
ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్‌లో ప్రతి ఏడాది గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు.. ఇందులో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ తర్వాత భక్తులు కొరడాతో కొట్టించికుంటారు.. గోవర్ధన్ పూజ తర్వాత కొరడా దెబ్బలు తింటే సమస్యలు అన్నీ తొలగిపోతాయని ప్రజల నమ్మకం.. ఇక, దుర్గ్‌లోని జంజిగిరి గ్రామంలో గోవర్ధన్ పూజకు హాజరయ్యారు సీఎం భూపేశ్ బఘేల్.. ఈ సందర్భంగా బీరేంద్ర ఠాకూర్ అనే వ్యక్తితో సీఎం భూపేశ్ బఘేల్‌ను కొరడాతో కొట్టించుకున్నారు.. ఇక, ఆ తర్వాత సీఎం మాట్లాడుతూ.. గోవును పూజించే ఈ గోవర్ధన్ పూజా కార్యాక్రమం చాలా గొప్పసంప్రదాయంగా తెలిపారు.. మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా భావి తరాలకు అందించడం మనంది బాధ్యత అన్నారు. అయితే, సీఎం కొరడాతో కొట్టించుకున్న వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
#WATCH | Chhattisgarh Chief Minister Bhupesh Baghel getting whipped as part of a ritual on the occasion of Govardhan Puja in Durg pic.twitter.com/38hMpYECmh
— ANI (@ANI) November 5, 2021
తాజావార్తలు
-
BRICS Summit 2026: ప్రపంచ నేతల రాకతో ఢిల్లీకి కొత్త కళ.. BRICS సదస్సు పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Asia Cup 2026: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. సెమీఫైనల్ లో శ్రీలంక ఘన విజయం.. భారత్ తో ఫైనల్ సమరానికి సై.!
-
Idupu Kayitham Song: ప్రియదర్శి ‘శ్రీలత’ పాట అదిరిపోయిందిగా.. తెలంగాణ నేటివిటీతో కట్టిపడేస్తున్న రొమాంటిక్ మెలోడీ!
-
Nivin Pauly : మలయాళం ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ దిశగా ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?