Delhi pollution: ఢిల్లీలో కాలుష్యానికి కారణం ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు అధిక సంఖ్యలో రావడమే అని ఢిల్లీ సీఎం అతిషి ఆదివారం అన్నారు. నగరంలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో కాలుష్యానికి ఇతర రాష్ట్రాల బస్సులే కారణమవుతున్నాయని, బస్ డిపోల్లో కాలుష్య నిరోధక చర్యలను అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీలో అతిషి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో అత్యంత వేగంగా వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ముందు జాగ్రత్తగా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 14(సోమవరం) నుంచి జనవరి 1 వరకు హస్తినలో టపాసుల కాల్చివేతను నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యాటవరణ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్- ఆప్ ప్రభుత్వం మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి అతిషి.. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకి షిప్ట్ అయ్యారు. అయితే తాజాగా బంగ్లా నుంచి అతిషికి సంబంధించిన వస్తువులను బలవంతంగా తొలగించి సీలు చేశారు.
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అసెంబ్లీలో అరవింద్ కేజ్రీవాల్ కుర్చీ మారిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ సీటు సంఖ్య 1 నుంచి 41కి మారింది.