టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ సంవత్సరానికి ఎంత లేదన్నా రెండు నుంచి మూడు సినిమాలు చేసుకుంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు. గతేడాది కూడా ఆయన్నుంచి ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలొచ్చినప్పటికీ అవి రెండూ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో ఇకపై సినిమాల వేగాన్ని తగ్గించాలని కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు రవితేజ. ఇందులో భాగంగా ప్రస్తుతం రవితేజ. ‘మాస్ జాతర’ అనే సినిమాతో రాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్…