నేటి కాలంలో ఆచార్య దేవో భవకు అర్థమే మారిపోతుంది. సినిమాల ప్రభావమో.. లేదంటే సోషల్ మీడియా ప్రభావమో తెలియదు గానీ.. విద్యార్థులు గాడి తప్పుతున్నారు. మొన్నటికి మొన్న అహ్మదాబాద్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణతో టెన్త్ స్టూడెండ్‌ను 8వ తరగతి విద్యార్థి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు.
ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. సకినాకా ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మైనర్ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు
Harassment: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం అనివార్యంగా మారింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఉంటోంది. స్మార్ట్ ఫోన్ లేకుంటే రోజు గడవని పరిస్థితి నెలకొంది. అలా సెల్ ఫోన్ శరీరంలో ఓ భాగమైపోయింది.