కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్దకు చేరింది. ఆర్మీ కాలేజీకి చెందిన వైద్యుడి పిటిషన్‌తో సహా మూడు లేఖ పిటిషన్లు సీజేఐకి పంపబడ్డాయి. ఈ భయంకరమైన ఘటనపై సీజేఐ స్వయంచాలకంగా స్పందించి, త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి ఆయుధాలు ఉపయోగించే దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయని, అయితే ఇక్కడ హింసను అరికట్టేందుకు చర్చలు, సహన సంస్కృతిని అవలంభిస్తున్నామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.
కోర్టుల్లో విచారణ, తీర్పుల సందర్భంలో లింగ వివక్షకు తావు లేకుండా పదాలను వినియోగించడంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండే మూస పదజాలానికి సర్వోన్నత న్యాయస్థానం స్వస్తి పలికింది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారించనుంది. సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో పిటిషన్లపై విచారణ ఉంటుంది.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానో వేసిన పిటిషన్‌ను విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం ఇద్దరు కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది.
భారతదేశంలో ఎవరినైనా ప్రేమించడం, కులాంతర వివాహం చేసుకోవడం, వారి కుటుంబ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం వల్లే వందలాది మంది యువకులు పరువు హత్యల కారణంగా మరణిస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.