సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయ్‌పై షూతో దాడికి యత్నం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వృద్ధ న్యాయవాది రాకేష్ కిషోర్(71)పై నేరపూరిత ధిక్కార చర్యలకు ఏజీ ఆమోదం తెలిపింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై మరోసారి నిందితుడు రాకేష్ కిషోర్ పరుష వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో ప్రవర్తించిన తీరుకు ఏ మాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. పైగా తనకెలాంటి భయం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఓ లాయర్ దాడికి యత్నించాడు. ఈ అంశంపై తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. హింసకు సనాతనంలో చోటు లేదని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌పామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నాన్ని ఖండించారు. “ఇది…
సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి జరిగింది. బీఆర్.గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించాడు. గవాయ్‌పై షూ విసిరాడు. దీంతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది.
భారత న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో నడవడం లేదని.. చట్టబద్ధమైన పాలనతోనే నిర్వహించబడుతుందని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గవాయ్ మారిషస్‌లో పర్యటిస్తున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) భూషణ్ రామకృష్ణ గవాయ్ శుక్రవారం (జూన్ 27) జరిగిన ఓ కార్యక్రమంలో తన భావాలను పంచుకున్నారు. నాగ్‌పూర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలో అత్యున్నత న్యాయ పదవిని చేరుకున్నందుకు సీజేఐ గవాయ్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రుల కృషి, పోరాట కథను వివరించారు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.