Supreme Court: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత కే పొన్ముడిని మంత్రివర్గంలో చేర్చుకునేందుకు గవర్నర్ నిరాకరించడంపై ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానిస్తూ.. ‘గవర్నర్ సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారు’’అని అన్నారు. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే, ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్‌కి…
Supreme Court:కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దాఖలైన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. సీఏఏపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు 3 వారాల్లో స్పందించాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సీఏఏని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 237 పిటిషన్లు దాఖలయ్యాయి.
డిప్యూటీ సీఎం పదవిని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవి రాజ్యాంగంలో లేనప్పటికీ.. ఎలాంటి నిబంధనను ఉల్లంఘించలేదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ఏదైనా కేసులో తీర్పు ఇచ్చే ముందు న్యాయమూర్తులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని అందులో వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండబోవని సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
Same-Sex Marriage Case: స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17న ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం చట్టబద్ధమైన గుర్తింపుకు నిరాకరించింది. దీనిపై చట్టాలు రూపొందించే బాధ్యత పార్లమెంటుదే అని స్పష్టం చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును వెల్లడించింది. స్వలింగ పెళ్లిళ్లు చేసుకునే ప్రాథమిక హక్కు లేదని స్పష్టం చేసింది.
Supreme Court: ఏదైనా ఒక ఇంటిని కానీ, ఇతర భవనాలను అమ్ముతున్న సమయంలో పాత విద్యుత్ బిల్లును విద్యుత్ బిల్లులను చెల్లించకపోవడం చూస్తుంటాం. ఇది కొత్తగా వాటిని కొనుగోలు చేసిన యజమానులపై పడుతుంది. అయితే వారు వాడిన కరెంట్ కు మేం ఎలా బిల్లు కడుతాం అనే ప్రశ్న ఇటువంటి సందర్భాల్లో ఉద్భవిస్తుంటుంది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
Supreme Court: సుప్రీంకోర్టులో ప్రతిష్టాత్మకంగా భావించి విచారణ చేసిన స్వలింగ వివాహాల చట్టబద్ధత పిటిషన్లపై విచారణ పూర్తయింది. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపుగా 10 రోజలు పాటు సుదీర్ఘంగా దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్కే కౌల్,జస్టిస్ ఎస్ ఆర్ భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడా ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వ…
Same Gender Marriage: సెమ్ సెక్స్ మ్యారేజ్ అంశాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ అంశంపై కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య వాడీవేడీ వాదనలు జరుగున్నాయి. స్వలింగ వివాహాల విషయంలో ఆ జంటలు తమ హక్కులను కోల్పోతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే LGBTQIA+ కమ్యూనిటీ ఆందోళనల్ని పరిశీలించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది.
Death Penalty: ఉరితీసే విధానంపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది. మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం ఉరితీసే విధానం అమలులో ఉంది. అయితే దీన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయిన కేంద్రం తరుపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వెల్లడించారు.