ఉక్రెయిన్‌పై రష్యా… 70 రోజులకుపైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. సైనిక చర్య పేరుతో దండయాత్ర మొదలుపెట్టిన క్రెమ్లిన్… ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. క్షిపణుల వర్షం కురిపిస్తుండటంతో… భవనాలు నేలమట్టమవుతున్నాయి. వాటి కింద ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో ఒకటైన ఖర్కివ్‌లో రెండు నెలల క్రితం రష్యా ఓ భవనంపై బాంబులు వేసింది. శిథిలాల తొలగిస్తున్న ఉక్రెయిన్ సైన్యం…44 మృతదేహాలను ఆలస్యంగా గుర్తించింది. Read Also: Mahmood Ali : 3 నెలల్లో…
ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు ఉద్రిక్తంగా మారాయి. అసోం, మిజోరం బోర్డర్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అసోం పోలీసులు చనిపోయినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఎస్పీ సహా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇరువైపులా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సరిహద్దు సమస్యపై ఘర్షణలు జరిగాయి. అవి పునరావృతమయ్యాయి. సరిహద్దులోని 8 వ్యవసాయ పాకలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడమే తాజా ఘర్షణలకు కారణంగా…