టాటా ట్రస్ట్‌లో కొద్ది నెలలుగా కొన్నసాగుతున్న అంతర్యు్ద్ధం తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంతర్గత విభేదాలు టాటా గ్రూప్ వాతావరణాన్ని ఛిన్నాభిన్నం చేసి అశాంతికి దారి తీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరిగిన టాటా గ్రూప్ భేటీ వేదికైంది.
తనను తాను టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఓ వ్యక్తి 2025 సంవత్సరానికి సంబంధించి కొన్ని షాకింగ్ అంచనాలు వేశాడు. ఆయన చెప్పిన మాటలపై ఇంటర్నెట్‌లో చర్చ జరుగుతోంది. టైమ్ ట్రావెలర్ అని చెప్పుకునే ఎల్విస్ థాంప్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆయన కొన్ని తేదీలను సైతం ప్రస్తావించారు.
ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు రష్యా సైన్యం సిరియాలో భీకర పోరు సాగించాల్సి వచ్చింది. అలెప్పోను స్వాధీనం చేసుకున్న తర్వాత, హయత్ తహ్రీర్ అల్-షామ్ అంటే హెచ్‌టీఎస్(HTS) తిరుగుబాటుదారులు వ్యూహాత్మక నగరం హమా వైపు కదులుతున్నారు. సిరియాలోని హమా ప్రావిన్స్‌ను రక్షించుకోవడానికి ప్రభుత్వ దళాలు, ఆ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు తిరుగుబాటుదారులు హోరాహోరీగా తలపడుతున్నాయి.
సూడాన్‌లో దేశ సైన్యం, పారామిలిటరీల మధ్య తీవ్రమైన పోరు జరుగుతోంది. ఈ పోరులో దాదాపు 200 మంది మరణించారు. సుమారు 1,800 మంది గాయపడ్డారు. అయితే, కర్ణాటక నుండి వెళ్లిన 31 మంది వ్యక్తులు సూడాన్‌లో చిక్కుకున్నారు.కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) వారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు.