ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఎట్టకేలకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక నివాసాన్ని కేటాయించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అనంతరం రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. షాలిమార్‌బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. కాగా సీఎం రేఖా గుప్త అధికార నివాసం ఎక్కడ అన్నదానిపై చర్చమొదలైంది. సివిల్ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లా ‘శీష్ మహల్’ను ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శీష్ మహల్ లో ఉండబోనని ఆమె ఇప్పటికే స్పష్టం చేసింది.…