ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా విజయంతో జోష్ పెంచేశాడు. ఒకపక్క సినిమాతో బిజీగా ఉంటూనే మరోపక్క ఆహా ఓటిటీ ప్రమోషన్స్ పనులను కూడా బన్నీ తన బుజాల మీద వేసుకున్నాడు. ఆహా ఓటిటీ ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు అల్లు ఫ్యామిలీ గట్టిగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. టాక్ షో లు, కుకింగ్ షోలు, కొత్త సినిమాలు, డబ్బింగ్ సినిమాలతో ఆహా.. ఆహా అనిపిస్తోంది. ఇక ఓటీటీ ప్లాట్…