సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టైయాన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు.
సెప్టెంబరు 27, 2024న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్న దేవర చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయడానికి జాన్వీ కపూర్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మరో చిత్రంలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ సంతకం చేసింది. జాన్వీ కరణ్ జోహార్ తదుపరి చిత్రంలో ఒక చిన్న అతిధి పాత్రలో నటించేందుకు సంతకం చేసింది.
యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. ఏఎస్ రిగ్వేద చౌదరి సమర్పణలో ఆద్య ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కార్తీక్ రెడ్డి రాకాసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'FLASH BACK' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని ఖరారు చేశారు.