ఏపీలో ఒక వైపు టికెట్ల రేట్ల పై రచ్చ కొనసాగుతోంది. సినిమా వర్సెస్ రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో అంబికా కృష్ణ కామెంట్స్ చేయడంతో మరోమారు ఈ అంశం చర్చకు దారితీస్తోంది. ఏపీలో ఎలాంటి సినిమా షూటింగ్స్ జరగటం లేదన్నారు అంబికా కృష్ణ. పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ జరగకపోవడంతో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేదు. అందుకే ప్రభుత్వం సినీ పరిశ్రమ, ధియేటర్లపై ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. సీ క్లాస్ థియేటర్ల టిక్కెట్ల రేట్లు…
ఏపీలో విచిత్రమయిన పరిస్థితి ఏర్పడింది. థియేటర్లలో టికెట్ల రచ్చ కొనసాగుతుండగా వివిధ జిల్లాల్లో థియేటర్ల సీజ్ వివాదం రేపుతోంది. థియేటర్లపై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడైనా ఉల్లంఘించినట్లు తేలితే థియేటర్లను మూసేస్తున్నారు. ఎక్కడికక్కడ నోటీసులు జారీ చేయడంతో పాటు లైసెన్స్, ఉల్లంఘనపై పూర్తిగా నిఘా పెట్టారు. క్యాంటీన్లను కూడా వదిలిపెట్టడం లేదు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. థియేటర్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు, పోలీసులు. కలెక్టర్లు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ప్రతీ చోటా థియేటర్ కు…
ఏపీలో ఆన్ లైన్ టికెట్ల వ్యవస్థకు సర్వం సిద్ధం అవుతోంది. ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థకు నోడల్ ఏజెన్సీగా APSFTVDC నియామించింది. ప్రభుత్వ ఉత్తర్వులతో ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది APSFTVDC. ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ ఎలా వుండాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. పోర్టల్ రూపకల్పనపై ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెటింగ్ సంస్ధలతో ఒకటికి రెండు సార్లు భేటీ నిర్వహించారు మంత్రి పేర్ని వెంకట్రామయ్య, అధికారులు. వివిధ సినీ థియేటర్లతో ప్రైవేట్…
సినిమా హాళ్లు బతకడానికి అవకాశం ఇవ్వాలని హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం పై సెటైర్లు వేశారు. టికెట్ రేట్స్ గురించి పలు ట్వీట్లు చేశాడు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఈ ట్వీట్లు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ మీరు ఓ ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీ ఎంతకు అమ్మాలో ఏసీ రెస్టారెంట్లకు చెప్పరు. కానీ, సినిమా పరిశ్రమను మాత్రం ఎందుకు సమస్యగా చూస్తారన్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లకు…
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సినీ గేయరచయిత, మానవతావాది సిరివెన్నెల సీతారామశాస్త్రి లేని లోటు తీర్చలేనిదన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్. ఆయనకు తగిన గుర్తింపు లభించలేదని, మరిన్ని అవార్డులు ఆయనకు లభించాలన్నారు మాధవ్. ఆయనతో తమ కుటుంబానికి వున్న అనుబంధాన్ని మాధవ్ గుర్తుచేసుకున్నారు. తన తండ్రికి ఆయన ఎంతో సన్నిహితులు అన్నారు. సినీ ప్రస్థానానికి రాకముందే సమాజాన్ని మరింతగా చైతన్య పరిచారన్నారు. ప్రజల్ని అలరించడమే కాదు సామాజిక బాధ్యత ఆయన రచనల్లో వుండేదన్నారు. ఆయన సామాజికంగా, రాజకీయంగా,…
తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకణ్ని. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడా. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను. వారు త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సిరావడం విచారకరం.…
సిరివెన్నెల సీతారామ శాస్త్రి దాదాపు 3000 పాటలకు రాశారు. ఇక ప్రత్యేకంగా పొందుపరిచిన ఆయన పాటలు, రూపకాలు, ఛందస్సు, కవిత్వం, ప్రాసలకు ప్రసిద్ధి చెందాయి. తెలుగు సాహిత్యంలో నేటి తరానికి అర్థమయ్యేలా పాటలు రచించడంలో ఆయన స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు వరుసకు అల్లుడు అవుతారని అందరికి తెలిసిన విషయమే. త్రివిక్రమ్ టాలెంట్ ను రచయితగా ఉన్నప్పుడే గుర్తించిన సీతారామశాస్త్రి ఆయన సోదరుడు కూతురిని ఇచ్చి వివాహం చేశారు. అనంతరం వారి బంధం…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరన్న వార్త యావత్ సినీ పరిశ్రమను కుదిపేసింది. ఇక పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల బాధ అయితే వర్ణనాతీతం. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు. తండ్రి పార్థివ దేహం చూసిన కూతురు ధృతీ రాజ్ కుమార్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ చిన్నారికి కన్నీళ్ళు ఆగడంలేదు. గుండెల నిండా తండ్రి గురుతులు కదలాడుతుంటే.. తండ్రి ఇక రాడన్న…
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు యావత్ సినీ పరిశ్రమ నివాళి అర్పిస్తోంది. శాండల్ వుడ్ కన్నీరు మున్నీరు అవుతోంది. పునీత్‌కి తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం వుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, హీరో శ్రీకాంత్, ఆలీ, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తదితరులు పునీత్ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కన్నీరు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ను…
కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్పన్ ఆర్కె రోజా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అని తెలిసి చాలా బాధపడ్డాను. షాక్ అయ్యాను. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. వియ్ విల్ మిస్ యూ అంటూ రోజా ట్వీట్ చేశారు.…