సినిమా థియేటర్లలో సోదాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే నిబంధనల విషయంలో రాజీపడేది లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు . నిబంధనలకు విరుద్ధంగా థియేటర్లు నిడిపితే చూస్తూ ఊరుకోవాలా అని కౌంటర్ ప్రశ్న వేస్తున్నాయి. ఈ ఊపు చూస్తుంటే మరిన్ని థియేటర్లు మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా పరిశ్రమ వర్సెస్ ఏపీ సర్కార్ రగడకు తాజా ఎపిసోడ్ మరింత ఆజ్యం పోసినట్లు కనిపిస్తోంది. ఒక వైపు సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటంతో ఇప్పటికే…