సీఎం జగన్ విశాఖ పర్యటన సందర్భంగా మంత్రి సిదిరి అప్పలరాజుకి అవమానం జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో మరో కోణం బయటపడింది. మంత్రి అప్పలరాజు తీరుపై పోలీసు శాఖలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పోలీసుల తీరుపై మంత్రి అప్పలరాజు ఆగ్రహం చెందారు. విధి నిర్వహణలో వున్న సీఐని బూతులు తిట్టినట్టు వీడియో విడుదలైంది. పోలీస్ చొక్కా పట్టుకొని బెదిరింపులకు పాల్పడ్డారు మంత్రి అప్పలరాజు. జగన్ పర్యటన సందర్భంగా శారదా పీఠానికి అనుచరులతో వెళ్లిన…