సీఎం జగన్ విశాఖ పర్యటన సందర్భంగా మంత్రి సిదిరి అప్పలరాజుకి అవమానం జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో మరో కోణం బయటపడింది. మంత్రి అప్పలరాజు తీరుపై పోలీసు శాఖలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పోలీసుల తీరుపై మంత్రి అప్పలరాజు ఆగ్రహం చెందారు. విధి నిర్వహణలో వున్న సీఐని బూతులు తిట్టినట్టు వీడియో విడుదలైంది.
పోలీస్ చొక్కా పట్టుకొని బెదిరింపులకు పాల్పడ్డారు మంత్రి అప్పలరాజు. జగన్ పర్యటన సందర్భంగా శారదా పీఠానికి అనుచరులతో వెళ్లిన మంత్రి అప్పలరాజుని స్థానిక సీఐ అడ్డుకున్నారు. సీఎం పర్యటనలో మంత్రి అప్పలరాజుకి మాత్రమే అనుమతి ఉందని, మిగిలిన వాళ్లకు అనుమతి లేదని తేల్చి చెప్పారు సీఐ.
Read Also Minister Appalaraju: విశాఖలో మంత్రి సిదిరి అప్పలరాజుకు అవమానం
దీంతో ఎస్ఐ బూతులు తిట్టారంటూ మంత్రి అనుచరులు ప్రచారం చేశారు. అయితే అసలేం జరిగిందో వీడియో బయటకు వచ్చింది. మంత్రికి పోలీసులకు జరిగిన వాగ్వాదంను వీడియో తీసిన పోలీసులు దానిని విడుదలచేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అసలు విషయం. మంత్రి అప్పలరాజు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.