క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ప్రభువైన ఏసు క్రీస్తును భక్తిశ్రద్ధలతో ఆరాధించేందుకు క్రైస్తవులు సంసిద్ధమవుతున్నారు. క్రిస్మస్ పండుగలో ప్రధాన పాత్ర పోషించే స్టార్లు, క్రిస్మస్ ట్రీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
ఈ నెల 20న(ఎల్లుండి) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు.
హైదరాబాద్‌లోని చందానగర్‌లో గల చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ క్రిస్మస్ వేడుకల్లో బిగ్‌బాస్ ఫేం హిమజ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన చిన్నతనంలో క్రిస్మస్ వేడుకల జ్ఞాపకాల గురించి పంచుకున్నారు.
విజయవాడలోని నొవాటెల్ హోటల్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ పాల్గొన్నారు. హోటల్‌కు చేరుకున్న బిషప్‌లు, క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్ సందర్బంగా సీజేఐతో కేక్ కట్ చేయించారు. బిషప్‌లకు జస్టిస్ ఎన్వీరమణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ తినిపించారు. వేడుకల్లో ఎపి, తెలంగాణ హైకోర్టు సీజేలు .. జడ్జిలు తదితర ఉన్నతాధికారులు పాల్గన్నారు. మరోవైపు నోవాటెల్ హోటల్‌లో ఉన్న సీజేఐని కలిసేందుకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సీజేఐ రాష్ర్ట పర్యటనలో ఉన్న సంగతి…
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. వాస్తవానికి ఇది క్రిష్టియన్స్ పండగ. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అన్ని పండగలను అందరూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. డిసెంబర్ నెల వచ్చిందంటే పండగల కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రిస్మస్ మొదలుకొని వరుసగా న్యూఇయర్, సంక్రాంతి సెలెబ్రేషన్స్ కూడా అతి తక్కువ గ్యాప్ తో సెలెబ్రేట్ చేసుకుంటాం. ప్రస్తుతం అందరూ క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయారు. సెలెబ్రిటీలు సైతం తమ ఇంటికి లైట్స్ తో, క్రిస్మస్ ట్రీతో, శాంటా బొమ్మలతో అలంకరించి…
సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారికి గుడ్ న్యూస్ అందించింది. క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో 60 రోజుల ముందుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చే ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రస్తుతానికి ఏడు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి మూడు, కాకినాడకు రెండు,…
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్)… ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయినా ప్రచార చిత్రాలు, దోస్తీ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహాంగా వున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం రెండు రోజుల్లో ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేయనున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ చిత్రం వచ్చే ఏడాది…
అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’గా ఈ డిసెంబర్ లో రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం అఖిల్ పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యాడు. రా ఏజెంట్ గా పాత్రలో పరకాయ ప్రవేశం చేయటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఏజెంట్’ గా అతని లుక్ అందరినీ ఆకట్టకుంది. ఇప్పటి వరకూ అఖిల్ నటించిన సినిమాల్లో ఇదే బెస్ట్ లుక్ అనిపించుకుంది. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయటానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.…