వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల తరపున ఆడాడు. 142 మ్యాచ్‌ల్లో 4,965 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఆరు సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు బాదాడు. బెంగళూరు తరఫున రెండుసార్లు ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌లో గేల్ 357 సిక్సర్లు బాదాడు, ఇది ఇప్పటికీ ఓ రికార్డు. అంతేకాదు అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఇప్పటికీ గేల్ (175)…