Today (23-12-22) Business Headlines: ఎయిర్‌టెల్-అపోలో దోస్తీ: ఆరోగ్య సంరక్షణ రంగంలో అధునాతన 5జీ టెక్నాలజీని వాడుకోవటానికి ఎయిర్‌టెల్ మరియు అపోలో హాస్పిటల్స్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 5జీ టెక్నాలజీతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను కూడా వినియోగించుకున్నాయి. హెల్త్‌నెట్ గ్లోబల్, ఏడబ్ల్యూఎస్ మరియు అవేషా అనే సంస్థలను కూడా కలుపుకొని కలనోస్కోపీ ట్రయల్స్ నిర్వహించాయి. కలనోస్కోపీ ట్రయల్స్.. అంటే.. పెద్ద పేగు పరిశీలనకు సంబంధించిన పరీక్షలను చేపట్టాయి.