వెండితెర రారాజులా.. మెగా మహారాజులా.. ‘స్వయంకృషి’కి చిరునామాలా.. అభిమానుల ‘విజేత’గా.. అన్నార్తులకు అపద్బాంధవుడుగా.. అభిమానులకు అన్నయ్యగా.. అనుభవంలో మాస్టర్‌గా.. హోల్ ఇండస్ట్రీకి మెగాస్టార్‌గా ఎదిగిన నిలువెత్తు సినీ శిఖరం చిరంజీవిని భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. అత్యున్నత గౌరవం అందుకున్న చిరంజీవికి అదే స్థాయిలో శుభాకాంక్షలు తెలిపారు తెలుగు ఎన్నారైలు. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌పై చిరంజీవి సినీ లైఫ్ జర్నీ వీడియోను ప్రదర్శించారు. ఈ అరుదైన సన్నివేశం అందరిని ఆకట్టుకుంది. మెగా…