నందమూరి బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి అని అఖిల భారత చిరంజీవి యువత డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ మెగా కుటుంబంపై గతంలో కూడా అనేక సార్లు అవమానకరంగా మాట్లాడటం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే మా చిరంజీవి ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసెరిగి సంయమనం…