నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ‘డాకు మహారాజ్’పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టైటిల్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి, ఇటీవల విడుదలైన మొదటి గీతం ‘ది రేజ్ ఆఫ్…