Chinese Loan Apps: హైదరాబాద్ సహా దేశంలోని 16 చోట్ల చైనా లోన్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపింది. బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, పుణె, గురుగ్రామ్ తదితర నగరాల్లో నిర్వహించిన సోదాల్లో 46 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. హెచ్‌పీజెడ్ టోకెన్ యాప్‌లో డబ్బు పెట్టుబడి పెట్టి బిట్‌కాయిన్‌తోపాటు ఇతర క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేస్తే రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ కేటుగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రైడ్స్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు.
instant loan apps mafia, Chinese Nationals Involved: రూ. 500 కోట్ల భారీ ఇన్‌స్టంట్ రుణాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీసులు సుమారుగా రెండు నెలల విచారణ తరువాత భారీ స్కామ్ ను ఛేదించారు. తక్షణ రుణాలు ఇచ్చి.. విపరీతమైన వడ్డీలు కట్టాల్సిందిగా ఈ ముఠా సామాన్య ప్రజలను వేధిస్తోందని పోలీసులు వెల్లడించారు. చైనా నుంచి వచ్చే సూచనలతో ఈ ముఠా ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ భారీ స్కామ్ లో చైనా జాతీయుల…