చైనా ప్రధాని లీ కియాంగ్‌కు పాకిస్థాన్ కొత్త గిఫ్ట్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం, చైనా ఇంజనీర్లను చంపిన ఇద్దరు ఉగ్రవాదులను పాకిస్థాన్‌కు రాకముందే జైలుకు తరలించే పేరుతో..పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ సినిమా శైలిలో వారిని హతమార్చింది.
గత నెలలో పాకిస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో చైనీస్ ఇంజనీర్లు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా.. మార్చి 26న జరిగిన దాడిలో ఐదుగురు చైనా ఇంజనీర్లు, ఒక పాకిస్థానీ డ్రైవర్ మరణించారు. వీరంతా ఇస్లామాబాద్ నుంచి దాసు జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్తుండగా.. ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది.