ఉక్రెయిన్ యుద్ధంలో ఏ దేశానికి ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రతిజ్ఞ చేసింది. యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్‌లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని ప్రకటించింది. బీజింగ్ రష్యాకు సైనిక సహాయం అందించగలదనే పాశ్చాత్య ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ శుక్రవారం చెప్పారు.