China: చైనాలో దారుణం జరిగింది. 21 ఏళ్ల విద్యార్థి కత్తితో దాడి చేయడంతో 8 మంది మృతి చెందారు. ఈ ఘటన చైనా తూర్పు నగరమైన వుక్సీలో జరిగింది. వుక్సీలో శనివారం సాయంత్రం సమయంలో 21 ఏళ్ల విద్యార్థి కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్యల ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.