చైనా తన అధికారిక మ్యాప్‌ను విడుదల చేసింది. చైనా తన కొత్త మ్యాప్‌ను విడుదల చేసినప్పటి నుంటి భారత రాజకీయాల్లో వేడి పెరిగింది. ఈ కొత్త మ్యాప్‌లో భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని చైనా తన భూభాగంగా చూపింది.
చైనా సోమవారం రిలీజ్ చేసిన కొత్త మ్యాప్ ను చైనా వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అందులో తమ భూభాగంలో భారతదేశ ప్రాంతాలను చూపించింది. ఈ వ్యూహంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పందించారు.