China: డ్రాగన్ కంట్రీ చైనా రక్షణ బడ్జెట్‌ని పెంచింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, 2024 రక్షణ వ్యయాన్ని పెంచుతామని చైనా మంగళవారం ప్రకటించింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) వార్షిక సమావేశ ప్రారంభంలో గత ఏడాది కన్నా 7.2 శాతం పెరుగుదలను ప్రకటించింది. 2024లో రక్షణ బడ్జెట్‌ని 1.665 ట్రిలియన్ యువాన్లు ($231.4 బిలియన్లు) ఖర్చు చేయనుంది.