దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ ఎంతో సింగ్ కృషి చేశారు.. ఇక, 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది.. ఎన్నికల్లో శాసన సభకు పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది.. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే.. యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.