Fire Accident : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు తగిలినట్లు తెలుస్తోంది.…