POCSO Case: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌షా కోట్‌లో జరిగిన సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అభం శుభం తెలియని బాలికపై ఐదుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన పోలీసులు వెంటనే ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు…
Viral Video: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముగ్గురు చిన్నారులు ఉరివేసుకున్నట్లుగా కనిపిస్తూ ఒక స్టేజ్‌పై చెక్క లాగ్‌కు వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. పిల్లలు ఖైదీల వేషధారణలో ఉండగా, వారి తలలు నల్లని వస్త్రాలతో కప్పబడి ఉన్నాయి. ఈ సన్నివేశం స్కూల్ ఫంక్షన్‌లో ప్రదర్శించిన నాటకానికి చెందినదిగా తెలుస్తున్నప్పటికీ దీనిని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. Also Read: February 1st chage Rules : బడ్జెట్‌లో ఏం జరిగినా.. ఫిబ్రవరి…
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. గాలిపటం ఎగరవేస్తూ చెరువులో పడి చనిపోయాడు. లెక్చరర్స్ కాలనీలో ఉండే తేజ (11) గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు గాలిపటం దారం తెగిపోయి.. సమీపంలో ఉన్న చెరువులో పడింది. దీంతో.. గాలిపటం కోసం వెళ్లిన ఆ బాలుడు మృత్యుఒడిలోకి వెళ్లిపోయాడు.